Take a fresh look at your lifestyle.

ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలి-జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :

ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. శనివారం ప్రత్యేక ఇంటెన్సివ్ పునః పరిశీలన (ఎస్ ఆర్ ఐ)లో భాగంగా మ్యాపింగ్ ప్రక్రియ, లక్ష్యం మేరకు మ్యాపింగ్ పూర్తి చేసే ప్రక్రియలో భాగంగా బూతు స్థాయి అధికారుల పనితీరుపై జిల్లా కలెక్టర్ లు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ఎన్నిక అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులకు విధివిధానాలను సూచించారు. ఫిబ్రవరి మాసంలో రోజుల్లోగా నిర్దేశించిన లక్ష్యం మేరకు ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ ను వేగవంతం చేసి పూర్తి చేయాలని సూచించారు. బూతు స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవనే విషయాన్ని తెలియజేయాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులతో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ జిల్లాలో బూతు స్థాయి అధికారులను ప్రతి ఇంటిని సందర్శించి మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.
జిల్లాలో ఇప్పటి 61 శాతం మ్యాపింగ్ చేపట్టడం జరిగిందని, ఫిబ్రవరి నెలలో బూతు స్థాయి అధికారులు పట్టణ, గ్రామ స్థాయిలలో మెరుగ్గా పనిచేసినట్లయితే మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం అవుతుందని, దీనిపై తహసిల్దార్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. మ్యాపింగ్ లో ఎలాంటి పొరపాటులకు తావునీయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో 6, 7, 8 ఫారాలకు సంబంధించి పెండింగ్ లను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ రాజేశ్వరి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ నైమత్ అలీ, తహసిల్దార్ లు లక్ష్మి నారాయణ, వెంకటేశ్వరి, విజయ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.