Take a fresh look at your lifestyle.

సీఎంఆర్ఎఫ్ పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు వ‌రం – మందుముల ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి

 

ముద్ర, కాప్రా

సీఎంఆర్ఎఫ్ పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు వ‌రంగా మారింద‌ని ఉప్ప‌ల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మందుముల ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో సీఎం రేవంత్‌రెడ్డి అర్హులంద‌రికీ కూడా సీఎంఆర్ఎఫ్ కింద మెడిక‌ల్ బిల్లులు స‌కాలంలో చెల్లిస్తున్న‌ట్టుగా తెలిపారు. ఉప్ప‌ల్ నియోజకవర్గం చెందిన వారికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల‌ను శనివారం ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలకు అర్హులైన వారంతా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.ఈ కార్య‌క్ర‌మంలో , ఉప్పల్ డివిజన్ అధ్యక్షుడు బాకారం లక్ష్మణ్ ,రమంతపూర్ డివిజన్ అధ్యక్షుడు మహమ్మద్ రఫిక్, మల్లాపూర్ డివిజన్ అధ్యక్షుడు కాప్రా సాయి గౌడ్, ఇతర నాయకులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.