Take a fresh look at your lifestyle.

రాజ్యాంగాన్ని తూట్లు పొడుతున్న కాంగ్రెస్ పార్టీ-– జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్

– పిరాయింపు నేతలకు క్లీన్ చీట్ ఇవ్వడం దుర్మార్గం
– 10మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలి
– బీఆర్ఎస్ పార్టీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు

ముద్ర, తాండూరు:
తెలంగాణ రాష్ట్రంలో భారత రాజ్యాంగానికి కాంగ్రెస్ పార్టీ తూట్లు పొడుస్తుందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, వికారాబాద్‌ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్ అన్నారు.
శనివారం తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నివాసంలో రాజుగౌడ్‌ పార్టీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. దేశంలో రాజ్యాంగాన్ని కాపాడలంటూ రాహుల్‌ గాంధీ చేత పట్టుకుని తిరుగుతుంటే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్పీకర్ ప్రసాద్‌ కుమార్‌లు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్లిన ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి.. కాంగ్రెస్‌లోకి వెళ్లినా వారిపై క్లీన్ చీట్ ఇవ్వడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
దేశంలో రాజ్యాంగాన్ని బీజేపీ తూట్లు పొడుతుందని కాంగ్రెస్ అంటుందని, నిజానికి బీజేపీ కాదు కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగానికి తూట్లు పొడుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే 10 ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి.. మళ్లీ ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు. పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై హైకోర్టులో ఫిటిషన్ వేస్తామని అన్నారు. రాజ్యాంగాన్ని తూట్లు పొడిచేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ, ఏ పార్టీ అయినా ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్ పార్టీ అడ్డుపడుతుందని, పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, కౌన్సిలర్లు అనిల్, యోగానంద్, ఈర్షాద్, నాయకులు సంతోష్‌ గౌడ్, ఎజాజ్, ఇంతియాజ్ తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.