ముద్ర : ఆత్మకూర్ (ఎం) మండలంలోని సింగారం గ్రామంలో ఎస్సీ కాలనీ వాసులకు స్థానిక టిఆర్ఎస్ నాయకులు సప్పిడి ఝాన్సీ పురుషోత్తం రెడ్డి టెంటు సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎస్సీ కాలనీవాసులు శుభకార్యాలు నిర్వహించుకోవడానికి రూపాయలు రెండు లక్షలు విలువ చేసే టెంట్ తోపాటు వంట సామాగ్రిని, ఇతర సామాగ్రిని ఉచితంగా అందించడం జరిగిందని ఆమె తెలిపారు .ఈ సందర్భంగా ఎస్సీ కాలనీవాసులు ఝాన్సీ దంపతులను శాలువతో సత్కరించారు. అనంతరం కాలనీలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు వల్లాల రాములు , శ్రీహరి ,వెంకట్ రెడ్డి, చంద్రయ్య, శ్రీరాములు, సిద్ధులు, పాల సంఘం చైర్మన్ బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.