Take a fresh look at your lifestyle.

మోత్కూర్ మున్సిపల్ చైర్మన్ గా గడ్డం స్వప్న. –వైస్ చైర్మన్ గా పల్లెర్ల వెంకన్న

— నేడు గెలుపొందిన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం.
-కాంగ్రెస్ లో చేరిన 5వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ మొగుళ్ల అనురాధ.

మోత్కూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ గా పల్లెర్ల వెంకన్న.

మోత్కూర్ ముద్ర న్యూస్:మోత్కూర్ మున్సిపల్ చైర్మన్ గా 6వ వార్డు కౌన్సిలర్ గడ్డం స్వప్న, వైస్ చైర్మన్ గా 1వ వార్డు కౌన్సిలర్ పల్లెర్ల వెంకన్న ఖరారైనట్టు విశ్వసనీయ సమాచారం. 5వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన మొగుళ్ల అనురాధ కాంగ్రెస్ లో చేరినట్టు చెరారు. మోత్కూర్ మున్సిపల్ ఎన్నికల్లో 12 వార్డులకు గాను కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 3, ఒక వార్డు లో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. కాంగ్రెస్ గెలిచిన 1, 2, 6, 7, 8, 9, 11, 12వ వార్డుల కౌన్సిలర్లు క్యాంపులో ఉన్నారు. చైర్మన్ పదవి ఎస్సి మహిళకు రిజర్వ్ కావడంతో ఎస్సి స్థానం 6వ వార్డు నుంచి గెలిచిన గడ్డం స్వప్న సోమనర్సయ్య, జనరల్ స్థానం నుంచి గెలిచిన మెంట రమణనగేష్ తీవ్రంగా పోటీ పడ్డారు. వైస్ చైర్మన్ కోసం 1వ వార్డు నుంచి గెలిచిన పల్లెర్ల వెంకన్న, 9వ వార్డు నుంచి గెలిచిన బీసు శ్రీకాంత్ తీవ్రంగా పోటీ పడ్డారు. చైర్మన్ ఎంపిక విషయంలో ఎమ్మెల్యే సామేల్ గడ్డం స్వప్నకే ఇవ్వాలని పట్టుబట్టి కూర్చునట్టు తెలిసింది. ఎంపీ చామల అనుచరుడైన 9వ వార్డు కౌన్సిలర్ బీసు శ్రీకాంత్ కు వైస్ చైర్మన్ ఇవ్వాలని ఎంపీ వర్గం కోరగా..ఇస్తే పల్లెర్ల వెంకన్నకు ఇవ్వాలని, లేని పక్షంలో కారుపోతుల వెంకన్నకు ఇవ్వాలని చర్చించినట్టు తెలిసింది. సామాజిక సమీకరణాల్లో ఎస్సి, బీసీ కాంబినేషన్ లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక చేస్తే బాగుంటుందని, వచ్చే మార్కెట్ చైర్మన్ పదవుల్లో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఫైళ్ల సోమిరెడ్డికి మోత్కూర్ మార్కెట్ చైర్మన్ ఇస్తే సామాజిక సమీకరణాలు లెవల్ అవుతాయని ఎంపీ ప్రతిపాదన పెట్టినట్టు సమాచారం. ఒకానొక దశలో ఎవరూ పట్టు విడువక పోవడం, ఎవరి ప్రయత్నాల్లో వారు ఉండటంతో చైర్మన్, వైస్ చైర్మన్ లను మీరే నిర్ణయించండి.. అని కౌన్సిలర్లే చీటీలపై పేర్లు రాసి సూచించాలని చెప్పినట్టు తెలిసింది. చర్చలు. బుజ్జగింపులతో ఎట్టకేలకు చైర్మన్ గా గడ్డం స్వప్నసోమనర్సయ్య, వైస్ చైర్మన్ గా పల్లెర్ల వెంకన్న లను ఖరారు చేసినట్టు సమాచారం. ఇప్పటికే మున్సిపల్ కమిషనర్ గెలుపొందిన కౌన్సిలర్లకు ప్రమాణ స్వీకారంతో పాటు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం ఫామ్-2 పత్రాలు అందజేశారు. సోమవారం మోత్కూర్ మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. తొలుత కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్లను కౌన్సిలర్లు ఎన్నుకుంటారు. 5వ వార్డ్ కౌన్సిలర్ మొగుళ్ళ అనురాధ చేరికతో కాంగ్రెస్ కౌన్సిలర్ల సంఖ్య 9కి చేరింది.

Leave A Reply

Your email address will not be published.