ముద్ర, కోరుట్ల;
తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చేర్మెన్ గా నియామకం అయిన సందర్బంగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు కు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అభినందనలు తెలిపి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా జువ్వాడి మాట్లాడుతూ చైర్మన్ పదవితో మరింత బాధ్యత పెరిగిందన్నారు. అన్ని వర్గాల వారిని కలుపుకొని ముందుకెళ్తానని, పదవిని అందించిన ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలిపారు.