-
ఉత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించిన ధర్మకర్తల మండలి
ముద్ర ప్రతినిధి, బోడుప్పల్: బోడుప్పల్ నగర పాలకసంస్థ పరిధిలోని పెంటారెడ్డి కాలనీలో కొలువైవున్న శ్రీ నిమిషాంబిక మాత దసరా నవరాత్రి ఉత్సవాలకు ఆలయ ధర్మకర్తల మండలి, రాష్ట్ర నకాష్ సంఘం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీ సోమవంశ క్షత్రియుల కులదేవత అయిన మాతా నిమిషాంబికా దేవి దసరా శరన్నవరాత్రి ఉత్సవాల కరపత్రాన్ని శుక్రవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో ఆవిష్కరించారు. ఈ ఏడాది సెప్టెంబరు 22వ తేదీ (సోమవారం) నుంచి అక్టోబరు 2వ తేదీ (గురువారం) వరకు ఉత్సవాలను అత్యంత వైభవోవేతంగా, గతంలో ఎన్నడూ జరగని రీతిలో నిర్వహించాలని సంకల్పించారు. ప్రతి రోజు అమ్మవారిని విశేష అలంకరణ చేస్తారు.
నవరాత్రులలో ప్రదక్షిణలు చేసే భక్తులకు ఏలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు కల్పించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల కోసం మంచి నీరు, ప్రసాదాలు ఉచితంగా వితరణ చేయడానికి సంసిద్ధులవుతున్నారు. ఆలయం వద్ద పార్కింగ్ సౌకర్యం పూర్తి స్థాయిలో లేని కారణంగా నవరాత్రులలో ఆలయానికి వచ్చే భక్తులు ప్రజా రవాణా వ్యవస్థ వినియోగించుకుని రావాలని సూచిస్తున్నారు. ప్రతి రోజు ఉదయం 6.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటలవరకు ఆలయం తెరిచివుంటుంది. అలాగే సాయింత్రం. 5.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు ఆలయంలో అమ్మవారి దర్శనం చేసుకోడానికి వీలుగా తెరచివుంచుతారు. ప్రదక్షిణలు మాత్రం ప్రతి రోజు ఉ. 6.00 గంటల నుంచి ఉదయం 9.00 గంటల వరకు… అలాగే మధ్యాహ్నం 2.00 గంటల నుంచి 5.00 గం. ల వరకు 16 లేదా 108 ప్రదక్షణల కోసం అనుమతిస్తారు. దయచేసి భక్తులు పెద్ద మనస్సుతో సహకరించాలని ఆలయ ధర్మకర్తల మండలి విజ్ఞప్తి చేసింది. ఇతర సమయాలలో సర్వ దర్శనాలు, అర్చనలు మాత్రమే ఉంటాయని తెలిపారు., భక్తులందరూ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలు పొందాలని కోరారు.
కరపత్రం ఆవిష్కరించిన వారిలో ఆలయ చైర్మన్ కామరౌతు వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శులు కె. అశోక్ కుమార్, సంగు శ్రీనివాస్, రాష్ట్ర నకాష్ సంఘం ప్రధాన కార్యదర్శి కొరిచెర్ల శ్రీనివాస్ రావులు ఉన్నారు. అలాగే ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు ఎస్.గౌరీ శంకర్, బి.హిమచందర్, డి.నర్సింగ్ రావు, ఎమ్.శ్రీనివాస్ రావు, ఎమ్.సాయి బాబా (శ్యామ్), డి.సతీష్, రామగిరి శ్రీకాంత్, ఎన్.శ్రీకాంత్, ఎన్ .రామకృష్ణ, వై.చంద్రశేఖర్, ఎన్.మోహన్, డి. రామక్రిష్ణ, కె. ప్రవీణ్ కుమార్ ఆలయ ప్రధాన అర్చకులు చంద్రశేఖర్ శర్మ, అర్చకుడు ఉమకాంత్ శర్మ పాల్గొన్నారు.
నవరాత్రులలో ప్రదక్షిణలు చేసే భక్తులకు ఏలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు కల్పించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల కోసం మంచి నీరు, ప్రసాదాలు ఉచితంగా వితరణ చేయడానికి సంసిద్ధులవుతున్నారు. ఆలయం వద్ద పార్కింగ్ సౌకర్యం పూర్తి స్థాయిలో లేని కారణంగా నవరాత్రులలో ఆలయానికి వచ్చే భక్తులు ప్రజా రవాణా వ్యవస్థ వినియోగించుకుని రావాలని సూచిస్తున్నారు.