కుషాయిగూడ , ముద్ర విలేఖరి: కుషాయిగూడ లోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవాలయం ట్రస్టీ బోర్డు ధర్మకర్తల ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. శుక్రవారం రాత్రి ఆలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకాగా దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ప్రణీత్ కొత్తగా ఎన్నికైన పాలకమండలి సభ్యులతో ప్రమాణం చేయించి బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా ధర్మకర్తలుగా బాధ్యతలు స్వీకరించిన సింగిరెడ్డి వెంకటరెడ్డి , తాళ్లపల్లి మేఘరాజు, మైలారపు సదానందం, నల్లచెరువుల రాకేష్, కేసిరెడ్డి సుజీత్ రెడ్డి, ఇందూరి రమాదేవి, సార వినోద్ కుమార్, మూర మోహన్ రెడ్డి, గద్దల క్రాంతి కుమార్, మైలారం బాల్ నరసింహ, సింగిరెడ్డి బలవంత్ రెడ్డి, వెంకటరమణ చార్యులు శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వీరేశం, చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, మాజీ కార్పొరేటర్ పావని రెడ్డి, స్థానిక కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.