ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కల్వకుర్తి మండలం ఎల్లికల్ గ్రామంలో విద్యుత్ షాక్‌తో ఓ యువకుడు మృతి చెందాడు.
గ్రామానికి చెందిన ప్రవీణ్‌గా మృతుడిని గుర్తించారు. ఇంటికి నీళ్లు కొడుతుండగా అకస్మాత్తుగా విద్యుత్ షాక్ తగలడంతో కిందపడిపోయాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే స్పందించి అతడిని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అయితే ఆసుపత్రికి చేరుకునేలోపే ప్రవీణ్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.