ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా స్వీకరించి త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రభుత్వం చేపట్టిన “ప్రజావాణి” కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలు, అభ్యర్థనలు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. స్వీకరించిన ప్రతి ఫిర్యాదు పై తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా భూసంబంధిత సమస్యలు, పింఛన్లు, రేషన్ కార్డులు, గృహనిర్మాణ పథకాలు, ఉపాధి అంశాలపై 120 వినతులు అందాయన్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వేగంగా పరిష్కరించెందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ప్రతి ఫిర్యాదుపై సమయపాలనతో చర్యలు తీసుకొని సమస్య లను పరిష్కరించాలని అన్నారు. ప్రజలు కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను అధికారులకు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, ఆర్ డి ఓ మంగీ లాల్, జడ్ పి సి ఇ ఓ సుధీర్, ఆర్ డి ఓ వాసు చంద్ర,డి ఆర్ డి ఓ శ్రీనివాస్, వివిధ శాఖ ల జిల్లా అధికారులు పాల్గొన్నారు.