Take a fresh look at your lifestyle.

గంజాయిని సరఫరా చేస్తున్న ఇద్దరు యువకుల అరెస్టు

 

1కేజీ గంజాయి, కారు,
ఒక సెల్ ఫోన్లు స్వాధీనం….

ముద్ర, కోరుట్ల;
కోరుట్ల పట్టణానికి చెందిన ఎం.డి. యాసిన్, కొత్తూరు సిద్ధార్థ్ అను ఇద్దరు యువకులు గత కొంతకాలంగా మహారాష్ట్ర నాందేడ్ పట్టణానికి చెందిన షేక్ ముజాహిద్ వద్ద తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి అట్టి గంజాయిని కోరుట్ల పరిసర గ్రామాల యువతకు ఎక్కువ ధరకు గంజాయిని విక్రయిస్తూ వచ్చిన డబ్బులతో జల్సాలకు అలవాటు పడ్డారు. అదే క్రమంలో వీరిద్దరూ శుక్రవారం రోజు కారులో నాందేడ్ పట్టణానికి వెళ్లి షేక్ ముజాహిద్ వద్ద గంజాయి కొనుగోలు చేశారు. మరుసటి రోజు కోరుట్ల వస్తున్న క్రమంలో ఎస్సై చిరంజీవి కి నమ్మదగిన సమాచారం ప్రకారం ఎస్సై సిబ్బందితో కలిసి కోరుట్ల శివారు వెటర్నరీ కాలేజీ ముందు వాహనాలు తనిఖీ చేపట్టారు. అదే సమయంలో నిందితుల కారును ఆపి విచారించగా పొంతన లేని సమాధానం ఇవ్వడంతో డాష్ బోర్డు నందు నిందితులు దాచిన 1కేజీ నిషేధిత గంజాయిని గుర్తించి స్వాధీనం పరుచుకోవడం జరిగింది. అలాగే ఒక సెల్ ఫోన్ మరియు కారును స్వాధీన పరుచుకుని నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు అనంతరం కోర్టులో హాజరుపరచడం జరిగింది. మరో నియందు ముజాహిద్ పరార్ లో ఉన్నారు. అతడిని త్వరలో పట్టుకుంటామని తెలిపారు. ఎస్సై మాట్లాడుతూ యువత గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిస కావద్దని, గంజాయిని సరఫరా చేసిన, అమ్మిన అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎస్సై చిరంజీవి మరియు సిబ్బంది అశోక్, సాగర్, రాజేశ్వరరావు లను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, డిఎస్పి రాములు అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.