Take a fresh look at your lifestyle.

తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షుడిగా వినోద్ అగర్వాల్

ముద్ర, హైదరాబాద్, ఆగస్టు 5: ఎం పి ఎల్ గ్రూపు మేనేజింగ్ డైరెక్టర్ వినోద్ కుమార్ అగర్వాల్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ( ఎఫ్ టి సి సి ఐ ) ఉపాధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. వ్యాపారదక్షత, దూర దృష్టి, నిర్వహణా సామర్థ్యం, నాయకత్వ లక్షణాలు, పారిశ్రామిక రంగానికి అందించిన సేవలు ఆయన ఎన్నికకు దోహదం చేశాయి. 2026-27 సంవత్సరంలో ఆయన ఈ పదవీ బాధ్యతలు నిర్వహిస్తారు. ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన వినోద్ కుమార్ అగర్వాల్ నేతాజీ నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ గా కూడా సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు ఆయనకు అభినందనలు తెలియజేశారు.అందిస్తున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు ఆయనకు అభినందనలు తెలియజేశారు.

vinod

 

 

 

Leave A Reply

Your email address will not be published.