Take a fresh look at your lifestyle.

బార్ అసోసియేషన్లలో పేరుకుపోయిన సమస్యలపై చిత్తశుద్ధితో కృషి చేయాలి : ఐ లు రాష్ట్ర ఉపాధ్యక్షులు మామిడి వెంకట్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
యాదాద్రి భువనగిరి జిల్లాలో పేరుకుపోయిన, పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కారం కోసం చిత్తశుద్ధితో ఐక్యంగా పనిచేయాలని నూతనంగా ఎన్నికైన భువనగిరి, రామన్నపేట, ఆలేరు, చౌటుప్పల, యాదగిరిగుట్ట, లలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు, కమిటీలను కోరుతూ నూతనంగా ఎన్నికైన కమిటీలకు, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఐలు రాష్ట్ర ఉపాధ్యక్షులు మామిడి వెంకట్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో పెండింగ్లో ఉన్న సమస్యలు ప్రధానంగా సొంత భవనాలు లేక అద్దె భవనాల లో ఇరుకు భవనాలలో కోర్టులు నడవడంతో క్లైంట్లు అడ్వకేట్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, నూతన కోర్టు భవనాల సముదాయాలను పూర్తిచేసే విధంగా కమిటీలు తగిన పరిశీలన చేయాలని వారు అన్నారు. జిల్లాలో వివిధ కోర్టులలో ఉద్యోగుల పోస్టులను త్వరితగతిన భర్తీ కి కృషి చేయాలని, జిల్లాకు రావలసిన లేబర్,ఫ్యామిలీ, ఎస్సీ ఎస్టీ, జూఎన్ఎల్, కోర్టులు వచ్చే విధంగా కృషి చేయాలని, వివిధ కోర్టులలో స్థానిక చిన్న చిన్న సమస్యలు పెండింగ్లో ఉండడం ద్వారా క్లైంట్లకు, న్యాయవాదులకు ఇబ్బందులు, ఎదురవుతున్నయని వారు అన్నారు. వివిధ కోర్టులను న్యాయమూర్తులు లేకపోవడంతో కేసులు పెండింగ్లో ఉంటున్నాయని భర్తకి చేయాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో ఐ లు జిల్లా గౌరవ అధ్యక్షులు కుక్క దువ్వ సోమయ్య, అధ్యక్షుడు బొల్లెపల్లి కుమార్, ఉపాధ్యక్షులు తడక మోహన్,పాల్వంచ జగతయ్య, ఎండి నేహాల్, సహాయ కార్యదర్శులు సీసా శ్రీనివాస్ సూదగానిశ్రీహరి, చింతల రాజశేఖర్ రెడ్డి కోశాధికారి బొడ్డు కిషన్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.