- మా భూమికి మాకు రక్షణ కల్పించండి.
హనుమకొండ ,ముద్ర: వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అనుచరులు గా చెప్పుకొని కొందరు సంఘవిద్రోహులు మా భూమిని కబ్జా చేసేఅందుకు ప్రయత్నం చేస్తున్నారని మాకు రక్షణ కల్పించాలని భాదితులు రంజిత్ రెడ్డి,రత్నం మేరీ కుటుంభ సభ్యులు అధికారులను వేడుకొన్నారు.హనుమకొండ ఏకశిలా పార్క్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో మాట్లాడారు.హసన్ పర్తి మండలం రెడ్డి పురం శివారు లోని సర్వే నెంబర్ 126 లో తమకు చెందిన స్థలం లో చుట్టూ ప్రహారి గోడ నిర్మించి,విద్యుత్,ఇంటి పన్ను కడుతున్నామని ఈ స్థలం పై కన్నేసిన కొందరు రాజకీయంగా కబ్జా చేసేందుకు, తీవ్రంగా ప్రయత్నం చేస్తూ కుటుంభ సభ్యులను ఇభంది పెడుతున్నారని అన్నారు.రక్షణ కోసం పోలీసులను ఆశ్రయిస్తే మా పైనే తప్పుడు కేసు నమోదు చేసారని,అన్ని సాక్షాలు మావద్ద ఉన్నాయని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.ఇప్పటికయినా ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి మా భూమికి మా కుటుంభ సభ్యులకు రక్షణ కల్పించాలని కోరారు.