Take a fresh look at your lifestyle.

సారా తయారీ కేంద్రాలపై దాడులు

ముద్ర ప్రతినిధి కల్వకుర్తి :సారా తయారీ కేంద్రాలపై ఆబ్కారీ శాఖ పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. మహబూబ్నగర్ ఎన్ఫోర్స్మెంట్, కల్వకుర్తి పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. వంగూరు మండలం తిరుమలగిరి తిప్పారెడ్డిపల్లి, జాజాల తండా, రంగాపూర్ తండాలో దాడులు చేయగా 800 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి 20 లీటర్ల సారాను స్వాధీనం చేసుకొని ఒకరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకటరెడ్డి తెలిపారు. దాడుల్లో ఎన్ఫోర్స్మెంట్ సీఐ వెంకటేశ్వర్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.