Take a fresh look at your lifestyle.

చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం….!

  • తహశీల్దార్ వరదన్

గొల్లపల్లి, ముద్ర: వేసవిలో దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం ఆభినందనీయమని తహశీల్దార్ వరదన్ అన్నారు.జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండల కేంద్రంలో గల నల్లగుట్ట ప్రాంతంలో రవీందర్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సోమవారం చలి వేంద్రాన్ని ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల తహశీల్దార్ వరదన్ పాల్గొని చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ముందుకు వచ్చిన రవీందర్ స్వచ్ఛంద సంస్థ ను అభినందిస్తున్నట్లు చెప్పారు. చలివేంద్రం ఏర్పాటు చేయడం గొప్ప విషయమని వారు కొనియాడారు.ప్రజలు చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమం లో బీజేపీ మండల అధ్యక్షులు కట్ట మహేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తడూరి సత్యనారాయణ, చెవులమద్ది శ్రీనివాస్, పెనాలపు అశోక్, చిర్ల గంగాధర్, వేల్పుల రాజేష్, శ్రీనివాస్, సింహాచలం, సత్యనారాయణ, మహంకాళి చంద్రశేఖర్,గంగాధర్ మధుసూదన్, లక్కకుల వెంకటేష్,సంగేమ్ కళ్యాణ్,అంకం భూమయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.