- ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.
- కథలాపూర్ మండల కేంద్రంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో పాల్గొన్న ప్రభుత్వ విప్.
- 62 మంది లబ్ధిదారులకు ఉచిత స్పేయర్లు, కళ్యాణ లక్ష్మి,ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణి చేసిన ప్రభుత్వ విప్.
కోరుట్ల/కథలాపూర్, ముద్ర: కుల గణన చేసి దేశానికి తెలంగాణ రాష్ట్రం ఒక రోల్ మోడల్ గా నిలిచిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం కథలాపూర్ మండల కేంద్రంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో పాల్గొన్నారు. ఆనంతరం రైతు వేదికలో రైతులకు అవగాహన సదస్సు, కళ్యాణ లక్ష్మి, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ చేశారు.మండల కేంద్రంలోని దులూరు గ్రామంలోని శ్రీ సీతారామ స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్న సందర్భంగా దేశంలో ఉన్న అసమానతలు తొలగించి కుల గణన చేయాలని సంకల్పించారని, దానికి అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం కుల గణన చేయడం జరిగిందన్నారు. అసెంబ్లీలో ఆమోదం తెలిపి, కేంద్ర ప్రభుత్వానికి పంపి, దానిని చట్టంగా మార్చి, షెడ్యూల్ ఆన్లైన్ లో చేర్చాలని సూచించారు. నేడూ రాహులు గాంధీ పోరాటం, రేవంత్ రెడ్డి ఆలోచన దేశ వ్యాప్తంగా కుల గణన చేయాలని సంకల్పించారు.నేడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ విజయంగా భావిస్తున్నామని, కుల గణన చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్రం దేశానికి ఒక రోల్ మోడల్ గా నిలుస్తుందన్నారు. వెనుకబడిన వర్గాల లెక్క తేల్చి వారికి ఉద్యోగ, విద్య రాజకీయంగా రిజర్వేషన్లు కల్పించాలని, భారత్ జూడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ సంకల్పించారన్నారు. బిసి బిడ్డగా తెలంగాణ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లు పొన్నం ప్రభాకర్ ప్రవేశపెడితే, బలపరిచే అవకాశం నాకు లభించిందని ఆన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో కూల గణన నిర్వహించి బీసీ ల సంఖ్య 56.36 శాతంగా లెక్క తేల్చారు. దేశంలో కూల గణనపై జరుగుతున్న ఒత్తిడి తట్టుకోలేక బిజెపి ప్రభుత్వం దానికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.
- ప్రజా సంక్షేమానికి పెద్దపీట.
రాష్ట్రంలో ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని విప్ పేర్కొన్నారు. రైతు వేదికలో అర్హులైన 22 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు.వ్యవసాయ పరిశోధన స్థానం కరీంనగర్ వారి ఆధ్వర్యంలో రైతులకు నిర్వహించిన జీరో టీల్లెటూ మొక్క జొన్న సాగు పై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సు పాల్గొని, రైతులకు పలు సూచనలు చేశారు.మార్కెట్ కమిటీ చైర్మన్ పూండ్ర నారాయణరెడ్డి, తదితర నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
