Take a fresh look at your lifestyle.

బిజెపి మునిసిపాలిటీ అధ్యక్షులుగా ప్రమోద్ కుమార్.

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: జిల్లాలో భారతీయ జనతా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు అన్ని మండలాలలో కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని బిజెపి జిల్లా అధ్యక్షులు నరేందర్ రావు తెలిపారు.జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో చాలా మండలాలలో కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని తాజాగా పది మండలాలకు అధ్యక్షులు నియమించడం జరిగిందని వివరించారు. మునిసిపాలిటీ అధ్యక్షుడిగా ప్రమోద్ కుమార్ ను నియమించినట్లు వివరించి ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.తెలకపల్లి మండల అధ్యక్షులుగా చిన్నారెడ్డి తిమ్మాజిపేట మండల అధ్యక్షుడు యశ్వంత్ నాగర్ కర్నూల్ రూరల్ అధ్యక్షుడు లోమేశ్వర్ రెడ్డి అచ్చంపేట రూరల్ అధ్యక్షులుగా జ్యోతి లింగాల అధ్యక్షులుగా నవీన్ చారకొండ అధ్యక్షుడుగా కృష్ణ బల్మూరు అధ్యక్షులుగా బాలస్వామి పాదర అధ్యక్షులుగా రవి, అమ్రాబాద్ అధ్యక్షుడిగా శ్రీనివాసులను నియమించినట్లు తెలిపారు.ఈనెల 15 లోపు గ్రామాలలో బూతు కమిటీలను ఏర్పాటు చేసిన ఉద్యమ కార్యాచరణను తీవ్రతరం చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.