Take a fresh look at your lifestyle.

ఎన్ పి ఆర్ డి జిల్లా తరగతులను జయప్రదం చేయండి..

వికలాంగులకు విద్య వైద్యం ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి : ఎన్ పి ఆర్ డి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్
ముద్ర, రామన్నపేట :

ఈనెల 24 న జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో జరిగే జిల్లా తరగతులను 17 మండలాల నుండి వికలాంగులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఎన్ పి ఆర్ డి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ పిలుపునిచ్చారు. బుధవారం రామన్నపేట మండల కమిటీ సమావేశం లో ఆయన పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వికలాంగులకు 6000 రూపాయలు పెన్షన్ వెంటనే అమలు చేయాలి వికలాంగులకు విద్య ఎప్పటికీ జిల్లా లో ఉన్న గ్రామాలలో ప్రత్యేక స్కూల్ ఏర్పాటు చేసి ఒక టీచర్ని నియమించాలన్నారు. వికలాంగుల పిల్లలకు 21 రకాల కలిగిన వాళ్లకు చదువు చెప్పించాలని ఇప్పటికీ జిల్లాలో వైద్యం అందక వికలాంగులు జిల్లా వ్యాప్తంగా వేలాది మంది చనిపోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి గిరికల లింగస్వామి, మండల ఉపాధ్యక్షులు నాగు నరసింహ, మండల సహాయక కార్యదర్శి పున్న శ్రీధర్, మండల నాయకులు కుందూరు వెంకటేశం, పున్న సదానందం, వంగాల నరసింహ, పగిల రమేష్ పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.