ముద్ర కూకట్‌పల్లి :
మత్తు పదార్థాలకు బానిసలై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని జగద్గిరిగుట్ట సీఐ వెంకటేష్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. స్థానిక రాజీవ్ గృహకల్పలోని సంస్కృతి పాఠశాలలో నిర్వహించిన డ్రగ్స్ అవగాహన శిబిరంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మట్లదుతు దీపం కాలుతుందని తెలిసి ఎలా తాకమో, మత్తు పదార్థాల జోలికి కూడా అలాగే వెళ్లకూడదని విద్యార్థులను హెచ్చరించారు. బాలికలు అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వేధింపులు ఎదురైతే వెంటనే షీ టీమ్స్ లేదా పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. సోషల్ మీడియా మాయలో పడకుండా,
తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో క్రమశిక్షణతో మెలగాలని హితవు పలికారు.
మత్తు పదార్థాల విక్రయాలను అరికట్టేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్సైలు, పోలీస్ సిబ్బంది మరియు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Next Post