ముద్ర కూకట్‌పల్లి :
రైతు భరోసా నిధులు విడుదల చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ గుడ్ విల్ హోటల్ చౌరస్తా వద్ద ఘనంగా కృతజ్ఞత సభ నిర్వహించారు. డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పట్వారీ శశిధర్ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ.. రైతును రాజు చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని కొనియాడారు. మొదటి విడతలో భాగంగా ఎకరం వరకు భూమి ఉన్న సుమారు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 3,590 కోట్ల నగదు జమ కానుందని ఆయన తెలిపారు. మొత్తం మూడు విడతల్లో రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు మరియు స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.