– రూ.76,400 వేల నగదు, 10 మొబైల్ ఫోన్లు, 4 బైకులు స్వాదీనం…..
– అంతరాష్ట్ర సరిహద్దు వెంట అర్థరాత్రి పోలీస్ రైడ్.
– చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు.
..సూర్యాపేట జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్.
చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని, నిందితులు ఎంతటివారైనా కఠినచర్యలు తప్పవని హెచ్చరించిన ఎస్పీ నరసింహ ఐపిఎస్ గారు.
16వ తేది అర్ధరాత్రి సమయంలో నమ్మదగిన సమాచారంపై కోదాడ పట్టణ పోలీసులు, స్పెషల్ బ్రాంచిపోలీసులు సంయుక్తముగా మెల్లచెరువు మండల పరిది రామాపురం, భూడాడు గ్రామాల సరిహద్దు శివారులో నిర్మానుష్య ప్రాంతంలో పేకాట నిర్వహిస్తున్న, ఆడుతున్న దాడులు నిర్వహించి 9 మంది పేకాటరాయుళ్లను ఆరెస్ట్ చేసి, 4 ద్విచక్ర వాహనాలు, 10 సెల్ ఫోన్లు స్వాదీనం చేసుకుని, 9 మంది పేకాట రాయుళ్లని అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడం జరిగినది. ఈ దాడిలో రూ.76,400 నగదును సీజ్ చేయడం జరిగినది.
పేకాట వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన, వ్యవస్థీకృతంగా నిర్వహించిన, సహకరించిన అలాంటి వారిపై గేమింగ్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుంది. కావున ప్రజలు ఇటువంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరముగా ఉండాలని హెచ్చరించారు. అక్రమ రవాణా అసాంఘిక కార్యకలాపాలపై జిల్లా పోలీస్ శాఖ ఉక్కు పాదం అవుతుందని ఇసుక అక్రమ రవాణా, చేసిన ప్రభుత్వ పంపిణీ బియ్యాన్ని అక్రమంగా వ్యాపారం నిర్వహించిన, పశువులను జంతువులను అక్రమంగా రవాణా చేసిన అలాంటి వారిపై పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.-