Take a fresh look at your lifestyle.

మెగా జాబ్ మేళాలో పలువురికి ఉద్యోగాలు

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో మెగా జాబ్ మేళా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ అధ్యక్షతన, టాస్క్, కెరీర్ గైడెన్స్ సెల్, మాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ జాబ్ మేళాకు జిల్లా నలుమూలల నుండి ఐటిఐ, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ, పీజీ చదివిన దాదాపు 100 మంది అభ్యర్థులు హాజరయ్యారు.

వీరిలో 11 మందిని వివిధ ఉద్యోగాలకు నేరుగా ఎంపిక చేయగా, మరో 82 మందిని తదుపరి దశ ఇంటర్వ్యూలకు ఎంపిక చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం సుధాకర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు చదువుతో పాటు మంచి ఉపాధి అవకాశాలు అందించాలనే ఉద్దేశంతోనే ఈ జాబ్ మేళా నిర్వహించినట్లు తెలిపారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఆయన నియామక పత్రాలను అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ జాబ్ మేళాలో ఎంపిక కాని అభ్యర్థులు నిరుత్సాహ పడకుండా తమ లోపాలను సరిదిద్దుకుని, నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ యు. గంగాధర్, టాస్క్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం రజిత, కెరియర్ గైడెన్స్ సెల్ కోఆర్డినేటర్ కె రమేష్ రెడ్డి, మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ప్రతినిధి బాలకృష్ణ, టాస్క్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ సాయికుమార్, వివిధ కంపెనీల ప్రతినిధులు, కళాశాల అధ్యాపకులు డాక్టర్ పి జి రెడ్డి, జాకిర్ హుస్సేన్, డాక్టర్ సూర్య సాగర్, సుభాష్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ హేమలత, అర్చన తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.