Take a fresh look at your lifestyle.

పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తక్షణమే తగ్గించాలి-మండల బి ఆర్ ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య

 

ఆటోను తాడుతో లాగి మెయిన్ రోడ్డుపై నిరసన తెలియ చేసిన బి ఆర్ ఎస్ శ్రేణులు

ముద్ర ,తుంగతుర్తి…
కేంద్ర ప్రభుత్వం డీజిల్ ,పెట్రోల్ పై లీటరుకు మూడు రూపాయలు పెంచి సామాన్యుల పై పెను భారం మోపిందని బి ఆర్ ఎస్ పార్టీ మాజీ మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు అన్నారు.. తుంగతుర్తి మండల కేంద్రంలో టిఆర్ఎస్ శ్రేణుల తో కలిసి ఆటోను తాడుతో లాగుతూ మెయిన్ రోడ్డు పై నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సీతయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ పై లీటరు మూడు రూపాయల వలన నిత్యావసర వస్తువులపై అధిక ధరలు పెరిగి పేద బడుగు బలహీన వర్గాల పై అదనపు భారం పడుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే సామాన్య మధ్యతరగతి కుటుంబాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పెంచిన ధరలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్. మండల నాయకులు మల్యాల రాములు. సోమేష్. గోపగాని శ్రీనివాస్. గుండగానీ లక్ష్మయ్య. మల్లేష్. సింహాద్రి. సర్పంచ్ రమేష్.. మహేష్. కదారి దాసు. ఉప్పల వీరయ్య. యాకూబ్.. రవి. వీరోజీ నాయక్. యాకూబ్. తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.