గండిపేట్ ముద్ర విలేకరి : మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని డాలర్ హిల్స్ కాలనీలో స్థానికుల ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్థానికంగా పర్యటించారు.పార్కు స్థలంలో నిర్మాణాలు జరుగుతున్నాయని డాలర్ హిల్స్ కాలనీవాసులు హైడ్రా కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.డాలర్ హిల్స్ లోని 3 ఎకరాల పార్క్ కబ్జాకు గురైందని డాలర్ హిల్స్ స్థానికులు అధ్యక్షులు విజయ్ ఫిర్యాదు చేయడంతో బుధవారం హైడ్రా కమిషనర్ పర్యటించారు. బుధవారం పార్కు స్థలం కబ్జా అయిన ప్రాంతాన్ని రంగనాథ్ సందర్శించారు. అనంతరం నిర్మాణదారులు మాట్లాడుతూ..2001 లో డాలర్ హిల్స్ లే అవుట్ క్యాన్సిల్ అయ్యిందన్నారు. ఐదు సంవత్సరాల 2006 లో 9.12 ఎకరాలను కొనుగోలు చేశామన్నారు.తాము ఎలాంటి కబ్జాలకు పాల్పడలేదని వారు తెలిపారు.ఇరువర్గాల వాదనలు విన్న హైడ్రా కమీషనర్ రంగనాథ్ ఇరు వర్గాల మధ్య ఉన్న డాక్యుమెంట్స్ పరిశీలించి, మీటింగ్ ఏర్పాటు చేసి అనంతరం సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. బ్లాస్టింగ్ అంశంపై కమిషనర్ రంగనాథ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.అనుమతులు లేని సెల్లార్ల నిర్మాణం జరుగుతుంటే ఏం చేశారని మున్సిపల్ అధికారులపై మండిపడ్డారు.బ్లాస్టింగ్ జరుగుతున్న నేపథ్యంలో పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు.
- హర్షం వ్యక్తం చేసిన అసోసియేషన్ సభ్యులు
పార్కు స్థలాన్ని కాపాడాలి అన్ని ఫిర్యాదు చేసిన వెంటనే వచ్చి పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ధన్యవాదాలు తెలిపారు. మణికొండ మున్సిపల్ కార్యాలయంలో పార్కు కాపాడాలని సంవత్సరం క్రితం ఫిర్యాదు చేసిన పట్టించుకున్న పాపాన పోలేదని అసోసియేషన్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్ఎండి ఆఫీసులో ఫిర్యాదు చేసిన స్పందించలేదు అన్నారు.