Take a fresh look at your lifestyle.

మండల పరిషత్ కార్యాలయంలో సీట్లు ఖాళీ

  • తొమ్మిది మందికి ముగ్గురు హాజరు.

మోత్కూర్, ముద్ర విలేఖరి: మోత్కూర్ మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఉద్యోగులు ఎవరు లేకపోవడంతో కార్యాలయం వెలవెల పోతుంది. కార్యాలయంలో సూపరిండెంట్ దయాకర్, జూనియర్ అసిస్టెంట్ మహమ్మద్ సమీ, కంప్యూటర్ ఆపరేటర్ భుష్పాక నరేష్ ముగ్గురు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. కార్యాలయంలో వివిధ పనుల కోసం వచ్చిన ప్రజలు కార్యాలయ సిబ్బంది లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఎంపీడీవో జిల్లా పరిషత్ కార్యాలయంలో అత్యవసర సమావేశానికి హాజరయ్యారని మండల సూపరిండెంట్ దయాకర్ తెలిపారు.మండల పరిషత్ కార్యాలయంలో మిగతా సిబ్బంది ఎవరు కూడా సకాలంలో సమయానుకూలంగా స్పందించడం లేదని ఇష్టానుసారంగా వస్తూపోతున్నారని వివిధ గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఇలాంటి సమస్యలు మరొకసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.