Take a fresh look at your lifestyle.

కొండనాగుల గ్రామంలో రచ్చబండ కార్యక్రమం

  • ప్రధాని నరేంద్ర మోడీ 11 సంవత్సరాల సుపరిపాలనలో జరిగిన అభివృద్ధి గురించి చర్చ.

అచ్చంపేట, ముద్ర విలేఖరి : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బల్మూరు మండలం కొండనాగుల గ్రామంలో రచ్చబండ కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో బల్మూరు మండల అధ్యక్షులు బాలస్వామి యాదవ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ప్రధాని నరేంద్ర మోథీ  11 ఏళ్ల సుపరి పాలనలో దేశంలో జరిగిన అద్భుతమైన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై విస్తృతంగా  చర్చించారు. ముఖ్యంగా పేద ప్రజలకు  కీలక పథకాలను అందించిన వివరాలు  వివరించారు. భారతదేశం బిజెపి పాలనతోనే  సుభిక్షంగా ఉంటుందని  11 సంవత్సరాల కాలంలో ప్రధాని నరేంద్ర మోధీ దేశంలో పేద ప్రజల కోసం ప్రారంభించిన కొన్ని ముఖ్య పథకాలను రచ్చబండలో బాలస్వామి యాదవ్ వివరించారు.

1) ప్రధాన్ మంత్రి అవాస్ యోజన (PMAY) – పట్టణాలు మరియు గ్రామాలలో పేదలకు ఉచితంగా లేదా తక్కువ ధరకే ఇళ్లు కల్పించే పథకం.

2) ఉజ్వల యోజన – పేద కుటుంబాల మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్‌లు అందించడం ద్వారా ఆరోగ్యకరమైన వంట పద్ధతులు ప్రోత్సహించారు.

3) స్వచ్ఛ్ భారత్ అభియాన్ – గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో మరుగుదొడ్లు నిర్మించడం ద్వారా పరిశుభ్రతను మెరుగుపరిచారు.

4) జన్ ధన్ యోజన – పేదలకూ బ్యాంకింగ్ సదుపాయాలు అందించే ఉద్దేశంతో కోట్లాది మంది బడుగు ప్రజలకు బ్యాంక్ ఖాతాలు తెరిచారు.

5) ఆయుష్మాన్ భారత్ (PM-JAY) – పేద కుటుంబాలకు ఉచితంగా వైద్య సేవలు (రూ. 5 లక్షల వరకు) అందించే హెల్త్ ఇన్సూరెన్స్ పథకం.

6) సౌభాగ్య యోజన – గ్రామీణ ప్రాంతాల్లో పేద కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ కనెక్షన్లు అందించారు.

7) ముద్రా యోజన – చిన్న వ్యాపారాలు మరియు స్వయం ఉపాధి కోసం తక్కువ వడ్డీ రేటుతో రుణాలు ఇవ్వడం.

8) కిసాన్ సమ్మాన్ నిధి – చిన్న రైతులకు ప్రతి సంవత్సరం రూ. 6,000 నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో జమ చేసే పథకం.

9) డిజిటల్ ఇండియా – గ్రామీణ ప్రజలకూ ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్ వంటి సాంకేతిక సేవలు అందించడం ద్వారా అభివృద్ధి.

10) అంత్యోదయ పథకాలు – అత్యంత పేదవారిని లక్ష్యంగా చేసుకుని రేషన్, ఉపాధి, విద్య వంటి రంగాల్లో ప్రత్యేక పథకాలు ప్రారంభించారు.

ఇవన్నీ పేదల జీవితాలలో మార్పును తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించాయని బల్మూర్ మండల్ అధ్యక్షుడు బాలస్వామి యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పత్య  నాయక్   మండల మాజీ అధ్యక్షులు పెద్ద యాదవ్  జనరల్ సెక్రెటరీ సైదులు. బల్మూరు మండల్ గిరిజన మోర్చా చందు. కోశాధికారి రామాచారి,  లక్ష్మణ్, బూత్ అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు.  గ్రామస్థాయిలో ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలియజేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి గెలుపు కోసం కృషి చేయాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.