Take a fresh look at your lifestyle.

సన్న బియ్యం పంపిణీ నీ ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్

మెట్ పల్లి, ముద్ర : సన్న బియ్యం పంపిణీ నీ ఏఎంసీ చైర్మన్ కూన గోవర్దన్ ప్రారంభించారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణి కార్యక్రమాన్ని బుధవారం మెట్ పల్లి పట్టణంలోని 13వ వార్డు రేగుంటలో గల రేషన్ దుకాణంలో ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ..పేదలు సైతం పెద్దల మాదిరిగానే సన్న బియ్యం తినాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని తీసుకువచ్చిందని తెలిపారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, తమ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు 20 లక్షల మందిని రేషన్ కార్డులలో పేర్లు చేర్పించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 3 కోట్ల పది లక్షల మందికి సన్న బియ్యాన్ని ఇవ్వనున్నామని తెలిపారు. కాగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెట్ పల్లి తహసీల్దార్ ఆర్. శ్రీనివాస్, ఎడ్మాల లక్ష్మారెడ్డి ట్రస్ట్ చైర్మన్ కొమ్ముల సంతోష్ రెడ్డి, పట్టణ మాజీ అధ్యక్షులు ఖుతుబొద్దీన్ పాషా,ఆర్ఐ ఉమేష్, రేగుంట వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.