- జిల్లా అదనపు కలెక్టర్ బి. ఎస్. లత.
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కు జిల్లా అదనపు కలెక్టర్ ఘనంగా నివాళులు అర్పించారు. బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ బి. ఎస్. లత పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి వారి ఆశయ సాధనకు పాటుపడాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికారి రాజు కుమార్, జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు చంద్ర శేఖర్ గౌడు, హరి అశోక్ కుమార్, బండ శంకర్, గౌడ సంఘ ప్రతినిధులు, బిసి,ఎస్సి, ఎస్టీ కుల సంఘాల ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.