- సాగునీరు రాక ఎండిన పంటలకు తక్షణమే ఆర్థిక సహాయం అందించాలి.
తుంగతుర్తి, ముద్ర: ఎస్సారెస్పీ కాలువల ద్వారా పంట పొలాలకు సరిపోయేంత సాగునీరు రాక ఎండిపోయిన పంటలకు ఎకరాకు 25000 రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ గురువారం మండల పరిధిలోని అన్నారం గ్రామంలో నీ ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించి మాట్లాడారు.ఈ సందర్భంగా బి.ఆర్.ఎస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రైతులకు అన్ని విధాల నష్టం జరుగుతూనే ఉందని చివరికి నాట్లు వేసిన వరి పొలాలకు సైతం సారినంత సాగునీరు ఇవ్వక పొలాలు ఎండిపోయేదాకా ప్రభుత్వం స్పందించలేదని అన్నారు.ఇకనైనా పాలకులు స్పందించి ఎండిపోయిన పొలాలకు ఆర్థిక సహాయం అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రైతులతో పాటు బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య ,గుండాగానీ రాములు గౌడ్ ,గాజుల యాదగిరి ,గోపగాని రమేష్,దొంగరి శ్రీనివాస్, పల్ల రాములు, మట్టిపల్లి వెంకట్, కడారి దాసు బల్లెం ప్రవీణ్ ,మన్నూరు పోతారాజు మాజీ సర్పంచ్ శేఖర్ఉప్పుల సైదులు తదితరులు పాల్గొన్నారు.