ముద్ర ప్రతినిధి, మెదక్:
నిరుపేదల సొంత ఇంటి కలను నెరవేర్చడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తీసుకొచ్చిందని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. మెదక్ మండలం శివాయపల్లి గ్రామంలో శుక్రవారం పండుగ వాతావరణంలో
ఇందిరమ్మ గృహాలను ప్రారంభించారు.
కలెక్టర్ మాట్లాడుతూ… ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల సంక్షేమ వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా జిల్లాలో పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు జరుగుతున్నాయన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పక్కాగా, పారదర్శకంగా జరుగుతుందన్నారు. సొంత స్థలం ఉండి ఇల్లు లేని వారికి మొదటి ప్రాధాన్యతగా గుర్తించి వారికి ఇల్లు మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు.
విడతలవారీగా నిధులు విడుదల చేస్తున్నారు. ఒక్కో గృహ నిర్మాణానికి ఐదు లక్షలు అందించడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 750 ఇందిరమ్మ ఇండ్లు పూర్తయ్యాయని, మిగిలిన వారు కూడా త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు. ఇందులో 650 ఇండ్లు గృహప్రవేశాలయ్యాయన్నారు.
ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ మాణిక్యం,మెదక్ ఆర్డీవో రమాదేవి, తహసిల్దార్ లక్ష్మణ్ బాబు, సర్పంచ్ వినీత, అధికారులు పాల్గొన్నారు.
యువత నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలి
మారుతున్న కాలానికి అనుగుణంగాయువతకు తాము ఎంచుకున్న రంగాలలో నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం ద్వారా ఉద్యోగ అవకాశాలు సాధ్యపడతాయని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక సంక్షేమ వారంలో భాగంగా శుక్రవారం కలెక్టరేట్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో వివిధ కళాశాలల నుంచి ఇంటర్మీడియట్ ,డిగ్రీ పూర్తి చేసుకున్న యువతకు నైపుణ్య అభివృద్ధి, స్వయం ఉపాధి పథకాల అమలుపై డిఆర్డిఓ శ్రీనివాసరావు, గిరిజన సంక్షేమ అధికారి నీలిమ, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ప్రకాష్ రావుతో కలిసి యువతకు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ… యువతకు సాంకేతిక, వ్యవస్థాపక నైపుణ్యాలలో ఉచిత శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసిందని మారుతున్న కాలానికి అనుగుణంగా పోటీ ప్రపంచానికి దీటుగా నిలబడాలంటే కంప్యూటర్ కోర్సులలో ప్రతిభావంతులై ఉండాలన్నారు.
ఈ శిక్షణా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని యువత లబ్ధి పొందాలన్నారు.
అంతకుముందు ఐటీసీ సంస్థ నుండి ప్లాంట్ మేనేజర్ ఆనంద్, టెక్నీషియన్ శివయ్య నైపుణ్యత శిక్షణ ద్వారా ఉద్యోగాలు పొందే విధానంపై సమగ్రంగా వివరించారు. ఐ.టీ.సీ సంస్థలో 50 ఉద్యోగాలున్నాయన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Prev Post