Take a fresh look at your lifestyle.

అభివృద్ధి పనులకు భూమి పూజ

కోరుట్ల, ముద్ర: రాష్ట్రంలోని అనేక ప్రాంతాలతో పాటు, కోరుట్లలో పలు అభివృద్ధి పనులకు నిధులు సమకూరుస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న పనులు అభినందించదగ్గ విషయమని కోరుట్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ నర్సింగరావు పేర్కొన్నారు. శనివారం కోరుట్ల పట్టణ 13, 15, 19వ వార్డులలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక నిధుల ద్వారా మంజూరైన నిధులతో పలు అభివృద్ధి పనులకు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు భూమి పూజ చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే అభివృద్ధి సంక్షేమానికి నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ ప్రతి ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీలు నెరవేరుస్తూ అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుందన్నారు.గత ప్రభుత్వాలు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి లాగినా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమoపై ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక నిధుల ద్వారా అభివృద్ధి పనులకు భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జువ్వాడి నర్సింగరావు తోపాటు కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.