Take a fresh look at your lifestyle.

నిత్యజీవితంలో ప్రతి ఒక్కరికి యోగా తప్పనిసరి

 

ముద్ర సూర్యాపేట జిల్లా ప్రతినిధి:

నిత్యజీవితంలో ప్రతి ఒక్కరికి యోగా తప్పనిసరి అని, విద్యార్థులు చదువుతోపాటు యోగ తప్పనిసరిగా నేర్చుకోవాలని తెలంగాణ యోగ ప్రచార సమితి అధ్యక్షులు ఎం.ప్రసాద్ తెలిపారు.ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ కళ్యాణ మండపం లో గత 15 రోజులు గా వేసవి లో విద్యార్ధులకు సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో శ్రీ వాసవి సేవా సమితి సహకారంతో ఉచితంగా నిర్వహిస్తున్న యోగా శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్ధులకు సూర్యాపేట ఉన్నత యోగ శిక్షణ కేంద్రం గురూజీ చాడపాపిరెడ్డి శ్రీ వాసవి సేవాసమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బచ్చు పురుషోత్తం బ్రాహ్మణ కళ్యాణ మండపం ప్రధాన కార్యదర్శి కట్టెకోల పూర్ణ చందర్ రావు లతో కలిసి సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ప్రస్తుత పరిస్థితులలో విద్యా పోటీ విధానంలో విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు వారికి యోగా ధ్యానం ఎంతో ఉపయోగపడుతుందని, విద్యార్థులు సైనస్, ఆస్తమా, ఆయాసం వంటి జబ్బులతో బాధపడుతున్నారని, వీరికి యోగా ద్వారా శ్వాసకు సంబంధించినటువంటి ప్రాణాయామములు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి మీ పిల్లలు యోగ నేర్చుకునే విధంగా ప్రోత్సహించాలన్నారు.
యోగా వలన ఆత్మవిశ్వాసం పెంచుతుందని, యోగ ఆసనాలు, ప్రాణాయామముల ద్వారా మీ పిల్లలకు శక్తితో పాటు మానసిక ఉత్సాహం పెరుగుతుందని అన్నారు. ముఖ్యంగా యోగ చేయడం వలన విద్యార్థులకు మెదడు చురుకుగా పనిచేసి జ్ఞాపకశక్తి పెరిగి చదువులో రాణించగలుగుతారని అన్నారు.
15 రోజుల పాటు శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యోగ ప్రచార సమితి కార్యదర్శులు ఝాన్సీ లక్ష్మీ, సుదర్శన్ రెడ్డి శ్రీ వాసవి సేవాసమితి గౌరవ సలహాదారులు గోపారపు రాజు,కోశాధికారి సోమ ప్రవీణ్ కుమార్,ఉపాధ్యక్షులు కుంచపర్తి రాజశేఖర్ సబ్యులు పోలా లక్ష్మీనారాయణ ,బెలిదే శ్రీనివాసు,వెంపటి శబరి నాథ్
యోగసాధకులు వల్కి లింగయ్య, వేల్పుల సుధాకర్, , గోరెంట్ల శ్రీనివాస్, మమత, శ్రీదేవి,జ్యోతి, జయలక్ష్మి, ఓ లింగయ్య, వెంకట్ రెడ్డి వెంకటేశ్వర్లు, మురళీకృష్ణ నాగరాజు, బాలకృష్ణ, శ్రీనాథ్, లక్ష్మి, విజయలక్ష్మి, విజయ్ సంతోష్,విద్యార్థిని,విద్యార్థులు,తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.