Take a fresh look at your lifestyle.

ఏపీ బడ్జెట్ లో కీలక కేటాయింపులు ఇవే!

 

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ కు అనుగుణంగా రూపొందించిన ఈ బడ్జెట్ లో సంక్షేమం, మౌలిక సదుపాయాలు. పరిశ్రమలు, వృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు.

ప్రదాన ఆర్థిక అంచనాలు – ఆర్థిక సూచికలు ఇవి
మొత్తం బడ్జెట్ వ్యయం – రూ. 3,32,205 కోట్లు
రెవెన్యూ వ్యయం- రూ. 2,56,142 కోట్లు
మూలధన వ్యయం – రూ. 53,915 కోట్లు
రెవెన్యూ లోటు – రూ. 22,002 కోట్లు
ద్రవ్య లోటు – రూ. 75,868
మొత్తం రెవెన్యూ ఆదాయం – రూ. 2,34,140

 

విభాగాల వారీగా కేటాయింపుల్లో బడ్జెట్ లో విద్య, మహిళా సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి. సూపర్ సిక్స్ పథకాలు, రోడ్లు, పరిశ్రమలు సహా కొన్ని కీలక కేటాయింపులు ఇలా ఉన్నాయి

తల్లికి వందనం పథకం కోసం 9,668
మహిళా శిశు సంక్షేమం – రూ. 4,581 కోట్లు
స్కాలర్‌షిప్‌లు – రూ. 3,836 కోట్లు
సమగ్ర శిక్షణ – రూ. 2,946 కోట్లు
ఉన్నత విద్య – రూ. 2,566 కోట్లు
డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం – రూ.2,161 కోట్లు
మన బడి మన భవిష్యత్తు -రూ. 1,500 కోట్లు
నైపుణ్యాభివృద్ధి – రూ.1,232 కోట్లు
పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా – రూ. 707 కోట్లు
సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర – రూ. 654 కోట్లు
యువత క్రీడలు – రూ. 438 కోట్లు
బీసీ సంఘాల కోసం – రూ. 23650 కోట్లు
పంచాయతీ రాజ్ – రూ.22 941 కోట్లు
కేంద్ర పన్నుల వాటా 64,362 కోట్లు
వివిధ వర్గాలకు ఆర్ధిక మద్దతు – రూ.2,320 కోట్లు
స్త్రీశక్తి – రూ.1,420 కోట్లు
వీకర్ సెక్షన్లకు సబ్సిడీ, ఉచిత విద్యుత్ – రూ.600 కోట్లు
ఆటో డ్రైవర్ల సేవలో – రూ.450 కోట్లు
ఉపకారవేతనాలు – రూ.3,836 కోట్లు
పాఠశాల విద్య – రూ.32,308.32 కోట్లు
బీసీ వెల్ఫేర్ – రూ.23,650.88 కోట్లు
పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్మెంట్ – రూ.22,941.54 కోట్లు
వైద్యారోగ్యం – రూ.19,306.04 కోట్లు
నీటివనరులు – రూ.18,223.67 కోట్లు
పట్టణాభివృద్ధి, పురపాలిక శాఖ – రూ.14,538.68 కోట్లు
విద్యుత్ రంగం – రూ.13,934.25 కోట్లు
వ్యవసాయ రంగం – రూ.11,745.21 కోట్లు
సాంఘీక సంక్షేమం – రూ.11,118.84 కోట్లు
ఈడబ్ల్యుఎస్ సంక్షేమం – రూ.10,699.33 కోట్లు
NTR భరోసా పెన్షన్ స్కీమ్ కోసం రూ. 27,719 కోట్లు…వృద్ధులు, వికలాంగులు ఇతరుల పెన్షన్లు పెంచేందుకు ఈ కేటాయింపులు చేశారు
దీపం 2 స్క్రీమ్ కింద రూ.2,601 కోట్లు – మహిళలకు సంవత్సరానికి మూడు ఉచిత LPG సిలిండర్లు ఇవ్వనున్నారు
పారిశ్రామిక స్టార్టప్ అభివృద్ధికోసం ఆంధ్రప్రదేశ్ గ్రోత్ ఫండ్ రూ. 100 కోట్లు కేటాయించారు…
ఇతర సంక్షేమ కార్యక్రమాల విషయానికొస్తే అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం వంటి స్క్రీములకు మునుపటి కేటాయింపలే కొనసాగించారు. మత్స్యకారులకు బ్యాన్ పీరియడ్ లో ఆర్థిక సహాయం పెంచారు.

Leave A Reply

Your email address will not be published.