ముద్ర, మల్యాల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే వేడుకలకు ఆలయంలో అర్చకులు దేవతా మూర్తులకు అలంకరణ జరిపి ప్రత్యేక పూజలు నిర్వహించి దేవతా ఉత్సవ మూర్తులకు పుణ్యాహవాచనము, రక్షాబంధనం, ఋత్విక్ వరణం, యాగశాల ప్రవేశం స్థాపిత దేవతార్చన, అగ్నిప్రతిష్ఠ హవనం, శ్రీ స్వామివారికి అభిషేకము, అర్చన, మహానివేదన, మంత్ర పుష్పం, తీర్థప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ టి.శ్రీకాంత్, డిప్యూటీ కమిషనర్, స్దాన చారి కపిందర్, ప్రధాన అర్చకులు రామకృష్ణ, జితేందర్ స్వామి, రఘు లతో పాటుగా ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.