కుషాయిగూడ , ముద్ర విలేఖరి: లంచం తీసుకుంటూ జిహెచ్ఎంసి చర్లపల్లి ఏ ఈ బి.స్వరూప అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టు పడ్డారు. పూర్తి వివరాలు..చర్లపల్లి డివిజన్లో పనిచేసిన బిల్లులు రాసేందుకు రామ్ రెడ్డి అనే కాంట్రాక్టర్ నుంచి ఏ ఈ స్వరూప రూ.1.2 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో మంగళవారం కాప్రా సర్కిల్ కార్యాలయంలో సదరు కాంట్రాక్టర్ ఏఈ స్వరూప కు రూపాయలు లక్ష ఇరవై వేలు నగదు అందజేస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఏ ఈ స్వరూపను నాంపల్లి లోని ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని తెలిపారు. లంచం అడిగితే టోల్ ఫ్రీ 1064 నెంబర్ కు ఫిర్యాదు చేయండి ప్రభుత్వ ఉద్యోగులు వివిధ పనుల నిమిత్తం లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064 లో నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చని ఏసీబీ అధికారులు తెలిపారు. అలాగే వాట్స్అప్ నెంబర్ 94404 46106 , ఇతర సామాజిక మాధ్యమాలలో తమ ఏసీబీ అకౌంట్లో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని వెల్లడించారు.