Take a fresh look at your lifestyle.

పహాల్గం ఉగ్రదాడికి నిరసనగా వాకర్స్ అశోషియేషన్ల నిరసన ర్యాలి

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జమ్మూకాశ్మీర్ పహాల్గం లో పర్యాటకుల పై జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ శుక్రవారం జగిత్యాల పట్టణంలోని వివేకానంద స్టేడియం, ఎస్ కే ఎన్ ఆర్, మునిసిపల్ పార్క్, ధరూర్ క్యాంపు వాకర్స్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలి నిర్వహించారు. ఈ సందర్భంగా జగిత్యాల పట్టణంలోని వాకర్ సభ్యులు స్వచ్చందంగా పాల్గొని బైక్స్ పై తహసీల్ చౌరస్తా, కొత్తబాస్టాండ్, టవర్ సర్కిల్, గంజ్, హనుమాన్ వాడ ఎస్ కే ఎన్ ఆర్ మీదుగా పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదలు చేసారు. అంతకు ముందు వాకర్స్ తహసీల్ చౌరస్తాలో ఉగ్రవాద దాడిలో మృతి చెందిన వారికి సంతాపంగా 2 నిముషాలు మౌనం పాటించారు.వాకర్స్ మాట్లాడుతూ పర్యాటకు ల పై పాశవిక దాడికి పాల్పడ్డ ఉగ్రవాధులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పి వైస్ చైర్మన్ ఒద్ది హరిచరణ్ రావు, వివిధ వాకర్స్ అసోషియేషన్ అధ్యక్షులు ఐల్నెనేని వెంకటేశ్వరరావు, గౌతంరెడ్డి, గుండా సురేష్, పాత సుధాకర్, ప్రధాన కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు, సభ్యులు కొత్త ప్రభాకర్, ముప్పల రామచంద్రరావు, సుధాకర్ రావు, ఎర్ర నర్సయ్య, రవి, శేఖర్ గౌడ్, గంగాధర్, రంగు రాజయ్య, రమణారావు, కమటాల సునీల్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.