ముద్ర, తెలంగాణ బ్యూరో :పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడ్డ ముష్కరులకు ఊహించని రీతిలో శిక్షిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరించారు.ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తా మని, వారిని మట్టిలో కలిపి సమయం ఆసన్నమైందన్నారు.ఇది పర్యటకులపై జరిగిన దాడి కాదని, భారత్ ఆత్మపై జరిగిన దాడిగా అభివర్ణిం చారు.ప్రతి ఉగ్ర వాదిని గుర్తించి, వెంటాడి భారత్ హతమారుస్తుం దని స్పష్టం చేశారు.గురువారం బిహార్ మధుబనిలో పంచాయతీరాజ్ దినోత్సవం లో పాల్గొన్న మోడీ, పహల్దాం ఉగ్రదాడిపై తొలిసారి మాట్లాడారు.ఉగ్రదాడికి పాల్ప డిన వారు భారీ మూల్యం చెల్లించుకుంటార ని పేర్కొన్నారు. అంతకుముందు పహలాం మృతులకు ప్రధాని నివాళులర్పించారు..నిమిషం పాటు మౌనం పాటించి అంజలి మోదీతో పాటు సభలోని వారంతా ఒక ఘటించారు.