ముద్ర కూకట్‌పల్లి:
నియోజకవర్గంలోని పలువురు లబ్ధిదారులకు మంజూరైన రూ. 2.30 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ మంగళవారం పంపిణీ చేశారు.
శ్రీ హేమ దుర్గా భవన్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో బండి రమేష్ మాట్లాడుతూ.. పేదలకు అండగా ఉండటంలో ప్రభుత్వం ముందుంటుందని పేర్కొన్నారు. తమకు ఆర్థిక సాయం అందేలా కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, బండి రమేష్‌కి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య, మోయిజ్, సలీం, మస్తాన్ రెడ్డి, కనకయ్య తదితరులు పాల్గొన్నారు