జిల్లా పోలీస్ కార్యాలయంలో నెలవారి నేర సమీక్షా సమావేశం జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఐపీఎస్ ఆదేశాలు
ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
జిల్లాలో నమోదయ్యే ప్రతి కేసులో ఎఫ్‌ఐఆర్ నుండి చార్జిషీట్ వరకు అన్ని ప్రక్రియలు పారదర్శకంగా ఉండాలని, బాధితులకు సకాలంలో న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఐపీఎస్ పేర్కొన్నారు.

బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్‌లో డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన జిల్లాలో నేరాల నమోదు, పెండింగ్ కేసులు, కోర్టు మానిటరింగ్, డయల్-100 కాల్స్ స్పందన, సీసీ కెమెరాల ఏర్పాటు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, సైబర్ క్రైమ్ కేసుల్లో బాధితులకు నగదు రిఫండ్, దొంగతనం, హత్యలు, అనుమానాస్పద మృతి కేసుల దర్యాప్తు వంటి అంశాలను సమీక్షించారు.
సైబర్ మోసాలు, మహిళా భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలను నిరంతరం నిర్వహించాలని సూచించారు. అలాగే “అరైవ్-అలైవ్” కార్యక్రమం ద్వారా రోడ్డు ప్రమాదాలపై అవగాహన పెంపొందించాలని ఆదేశించారు.
పెండింగ్ కేసులు లేకుండా వేగంగా దర్యాప్తు పూర్తి చేయాలని, పోలీస్ అధికారులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. పాత నేరస్తులు, రౌడీషీటర్లపై నిఘా ఉంచి నిరంతరం తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో:
అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీలు సాయి వెంకట్ రెడ్డి, బుర్రి శ్రీనివాస్, శ్రీనివాసులు, సీఐలు, ఎస్ఐలు, స్టేషన్ రైటర్లు పాల్గొన్నారు.