Take a fresh look at your lifestyle.

యువతకు ఉద్యోగ ఉపాధి కల్పించడం లక్ష్యం

  • కోరుట్ల ఎమ్మెల్యే డా.సంజయ్.

కోరుట్ల, ముద్ర విలేకరి: నియోజకవర్గ నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించడం లక్ష్యంగా ఈనెల 28వ తేదీన కోరుట్ల కట్కమ్ సంగయ్య ఫంక్షన్ హాల్లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కోరుట్ల ఎమ్మెల్యే డా.సంజయ్  తెలిపారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరిగే జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ జాబ్ మేళాలో 50కి పైగా కంపెనీలు పాల్గొంటాయని, పదవ తరగతి నుండి డిగ్రీ, పీజీ వరకు చదివిన విద్యార్థులందరూ అర్హులేనని అన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనుకుంటున్న యువత క్యూఆర్ కోడ్ ద్వారా ఎన్రోల్ కావాలని, మరిన్ని వివరాలకు 7893636313, 9948335533 నెంబర్లు ఫోన్ చేయాలని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.