Take a fresh look at your lifestyle.

క్రిస్టియన్ మైనారిటీ కోటా లో ప్రముఖ క్రైస్తవుడు పిన్నింటి స్టాన్లీ కోఆప్షన్ మెంబర్ గా వంద శాతం అర్హుడు

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
యాదాద్రి భువనగిరి జిల్లాలోనే మొదటి పాస్టర్ పిన్నింటి ఫిలమోన్ పాస్టర్ల వంశంలో ఇండియా మిషన్ కాంపౌండ్ లో జన్మించిన పిన్నింటి స్టాన్లీ, నల్గొండ జిల్లాలోనే ఉత్తమ రైతు అవార్డు గ్రహీత మిషనరీ సామ్ జిల్లెట్టయ్య నిస్వార్థ సేవలను ఆదర్శంగా తీసుకొని ఆయన మధ్యలోనే మిషన్ కాంపౌండ్ లో ఎదిగారు. చిన్నతనంలోనే వివిధ తండాల్లో దళిత వాడల్లో పెట్టినటువంటి అడల్ట్ లిట్రసీ పెద్దల విద్య రాత్రి బడుల్లో తల్లిదండ్రులతో పాటు వెళ్లి సహకారం అందించేవారు.
యవనప్రాయంలో వివిధ గ్రామాల్లో చైల్డ్ డెవలప్మెంట్ సమ్మర్ ప్రోగ్రామ్స్ లలో కూడా సహకారం అందించేవారు. వివిధ జిల్లాలోని గ్రామాల్లో కుట్టు సెంటర్లు ఏర్పాటు చేసి తన సహచారిణి పిన్నింటి సరోజన రెడ్డి ద్వారా పేద నిరుద్యోగ మహిళలకు కొట్టు శిక్షణలో తర్ఫీదు ఇప్పించి వందల మందికి స్వయం ఉపాధి కల్పిస్తూ, అనాధ ఆశ్రమ నిర్వాహణ, వృద్ధాప్యంలో ఉన్న వారిని విభిన్న ప్రతిభావంతులను వలస కార్మికులను మానసిక వికలాంగులను ఒంటరి మహిళలకు సేవ చేస్తూ అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లలో పిల్లలకు బ్యాగులు పలుకలు బాటిల్ బాస్కెట్లు, హాస్పటల్లో రోగులకు పళ్ళు పంపిణీ చేస్తూ గత 15 సంవత్సరాలుగా ఈ సేవను కొనసాగిస్తున్నారు.
కోవిడ్ లాక్ డౌన్ టైం లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నిరుపేద వలస కార్మికులకు బొగ్గుబట్టీలలో ఇటుక బట్టీలలో పనిచేసే పేద కార్మికులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. అన్ని శాఖల వారికి శానిటైజర్లు మాస్కులు పంపిణీ చేయడం జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం స్లంలలో ఉన్న పేదవారికి పంపిణి చేయడం అదేవిధంగా కోవిడ్ మహమ్మారిని పారదోలే విధంగా దేవునికి సర్వమత ప్రార్ధనలు చేయ్యడం సేవల్లో మరుపు రాని ఘట్టం, అందులో ప్రాముఖ్యమైనది. సలకపూర్ క్రాస్ రోడ్ లో 2006 సంవత్సరంలో హైవే ప్రక్కన బోర్వెల్ వేపియడం వల్ల ఈ 20 సంవత్సరాల కాలంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వేల మందికి ఆ నీళ్లు ఉపయోగపడడం చాలా హర్షించదగ్గ విషయం. వికలాంగుల సంక్షేమం కొరకు కృషి చేస్తున్న ఒక స్వచ్ఛంద సంస్థ లో భువనగిరి చుట్టుపక్కల లో ఉన్న మండలాలలో ఉన్న గ్రామాలకు సంబంధించిన వికలాంగుల వివరాలు సేకరించి ట్రై సైకిళ్లు సంస్థ వారు ఇవ్వడంలో వారికి తోడ్పాటు అందించారు. 2000 సంవత్సరంలో గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఆపరేషన్ మొబలైజేషన్ వారితో సహవాసం అదే విధంగా ముంబైలో యూత్ విత్ ఏ మిషన్ లో ట్రైనింగ్ తరువాత తమిళనాడులోని కొడైకెనాల్లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏవాంజెలిజం లో ట్రైనింగ్ తరువాత ఇంగ్లాండులోని పాస్టర్ల కాన్ఫరెన్స్లో ట్రైనింగ్ ఉస్మానియా యూనివర్సిటీలో కమ్యూనిటీ ఆర్గనైజర్ గా ట్రైనింగ్ అదేవిధంగా మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో కూడా వివిధ అంశాలలో ట్రైనింగ్ పొందారు ఈ అనుభవాలతో అమెరికాలో, ఇంగ్లాండ్లో, ఆస్ట్రేలియాలో అవకాశాలు లభించినప్పటికీ భారత దేశం పై ఉన్న మమకారంతో స్వజనులకు సేవ చేయాలనే ఉద్దేశంతో అవకాశాలను వదులుకున్నారు. రాజకీయాలలో భువనగిరి కాంగ్రెస్ పార్టీ పట్టణ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శిగా రాజకీయాల్లో సేవా ప్రారంభించి కొద్దికాలంలోనే పార్టీకి చేసినటువంటి సేవలను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ మాజీ చైర్మన్ ఫక్రుద్దీన్ జిల్లా ఉపాధ్యక్షులుగా నియమించారు. పది సంవత్సరాలుగా చేసిన సేవలను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర మాజీ చైర్మన్ అబ్దుల్ సోహెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. భువనగిరి మున్సిపాలిటీలో ని మిషన్ ఫర్ ఎలిమినేషన్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మధ్య సిద్దిపేట, సిరిసిల్ల, కోదాడ, నల్లగొండ, బోడుప్పల్ మున్సిపాలిటీలలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ స్పెషలిస్ట్ పరంకుశం సత్యనారాయణ సౌజన్య జాజుల గౌరీ తో పాటు వెళ్లి స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమాలలో 10 సంవత్సరాలు సహకారం అందించారు. ఆధ్యాత్మికంగా ఒక పాస్టర్ గా చర్చిలో 10 సంవత్సరాలుగా దైవ సేవలు కూడా చేస్తున్న అనుభవం గడించారు.
ఈ విధంగా గత 30 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి అంతులేని సామాజిక సేవా కార్యక్రమాలు గుర్తించిన కలెక్టర్లు వివిధ ఎన్జీవోలు అంతర్జాతీయ సంస్థలు జిల్లాస్థాయిలో రాష్ట్రస్థాయిలో వివిధ అవార్డులు ప్రశంసా పత్రాలు సన్మానాలు కూడా అందుకున్నారు. అందులో ప్రాముఖ్యమైనవి భువనగిరి ఆర్డీవో భువనగిరి మున్సిపాలిటీ కమిషనర్ కలుమునూరు రమణ చారి చేతుల మీదుగా ఉత్తమ కమ్యూనిటీ ఆర్గనైజర్ అవార్డు కోవిడ్ మహామ్మారి టైంలో విశేష సేవలు అందించినందుకు మిషన్ ఓబధ్య రాష్ట్రస్థాయి అవార్డు. సీనియర్ సేవకునిగా ఇండియా మిషన్ వారిచే ఇటీవల సికింద్రాబాద్లో గల వైఎంసిఏ లో అవార్డు సన్మానం అదేవిధంగా సామాజిక, దైవ సేవలో విశేష కృషి చేసినందుకు ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆడిటోరియంలో సేవా రత్న అవార్డు, గతంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ల ద్వారా ప్రశంసా పత్రం ఇవ్వడమే కాకుండా క్రిస్మస్ పండుగ సందర్బంగా విశేష సామాజిక సేవలు చేసినా వారికి రాష్ట్రస్థాయిలో ఇచ్చే ఎమినేంట్ క్రిస్టియన్ అవార్డుకు ఐదు సార్లు నామినేట్ చేశారు.
ఈ సేవలల్లో ప్రాముఖ్యంగా విద్యకు ప్రాధాన్యత ఇచ్చే రీతిలో 2015 నుండి భునగిరిలో కేంద్రీయ విద్యాలయ స్థాపన కొరకు ఎంతో కృషి చేశారు హైవే ప్రక్కన పిల్లలకు ప్రమాదకరంగా ఉన్న ఈ స్కూలుకు సర్వీస్ రోడ్డు కావాలని ఒంటరిగా ఇంకా ఉద్యమం చేస్తున్నారు
ఈ విధంగా అన్ని వర్గాల ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఔన్నత్యం కలిగి ప్రజల సంక్షేమం కొరకు నిరంతరం పాటుపడుతున్నారు ఈ విధంగా సౌబ్రాతృత్వం తో సేవలందిస్తున్న పిన్నింటి స్టాన్లీ సేవలను గుర్తించి క్రిస్టియన్ మైనార్టీ కోటాలో కో ఆప్షన్ పదవి ఇస్తే ఇంటర్నేషనల్ స్థాయి లో ఉన్న పరిచయాలతో ఇంకా ఉత్సాహంతో ప్రజలకు సేవలు చేయడానికి మార్గం సుగమమౌతుంది.

Leave A Reply

Your email address will not be published.