Take a fresh look at your lifestyle.

అపోహలకు తెర.. మంత్రితో కలిసివచ్చిన దినేష్..

మున్సిపల్ చైర్మన్ ఎన్నిక తర్వాత కాంగ్రెస్ లో చీలికకు కొందరి కుట్ర..

మంత్రితో కలిసివచ్చి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న దినేష్..

ధర్మపురి:

మున్సిపాలిటీ ఎన్నికల్లో ధర్మపురిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 15 మంది గాను 15 మంది విజయం సాధించగా ఓర్వలేని కొందరు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చీలికకు కుట్రలు చేశారు. అందరి కుట్రలను పటాపంచలు చేస్తూ సీనియర్ కాంగ్రెస్ నాయకులు దినేష్ పార్టీ మారుతున్నారని అపోహలకు తెరదించారు. ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు మంత్రితో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారితో కలిసి దినేష్ పాల్గొనడంతో చీలిక కుట్ర దారులు చివరకు అవాక్కయ్యారు.

ధర్మపురి మున్సిపల్ చైర్మన్ పదవి కోసం సీనియర్ కాంగ్రెస్ నాయకులు ధర్మపురి మండల పార్టీ అధ్యక్షులు సంఘనభట్ల దినేష్ భార్య సంతోషిని తో పాటు మరో సీనియర్ కాంగ్రెస్ నాయకులు వేముల రాజేష్ భార్య ధర్మపురి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ అయిన వేముల నాగలక్ష్మి పోటీ పడ్డారు.

మున్సిపల్ చైర్మన్ పదవి విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు వేముల నాగలక్ష్మి చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు దినేష్ భార్య మూడో వార్డు కౌన్సిలర్ అయిన సంతోషిని సైతం హాజరయ్యారు.

చైర్మన్ ఎన్నికల విషయం లో ఎలాంటి వివాదం లేనప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో వచ్చిన ఆదరణ చూసి ఓర్వలేక కొందరు సీనియర్ కాంగ్రెస్ నాయకులు దినేష్ తో మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ మధ్య వివాదం తలెత్తినట్లు ప్రచారం ప్రారంభించారు.

అంతటితో ఆగకుండా సీనియర్ కాంగ్రెస్ నాయకులు దినేష్ పార్టీ మారుతున్నట్లు సైతం ప్రచారం నిర్వహించారు. బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు దినేష్ తో చర్చలు జరిపారని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రచారం చేసి ధర్మపురి
కాంగ్రెస్ పార్టీలో చీలికకు కుట్రపన్నారు.

అయితే అందరి కుట్రలు భగ్నం చేస్తూ సీనియర్ కాంగ్రెస్ నాయకులు సంఘనభట్ల దినేష్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి బ్రహ్మోత్సవాలు ప్రారంభ వేడుకల్లో పాల్గొన్నారు. మంత్రితో కలిసి వచ్చి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడంతో కాంగ్రెస్ పార్టీలో కుట్రలకు తెర తీసిన వారి నోట్లో ఏలాకాయ పడ్డట్లు అయింది. మంత్రితో పాటు మున్సిపల్ చైర్మన్ దేవాలయ కమిటీ చైర్మన్ తో పాటు నూతన పాలకవర్గం కుటుంబ సభ్యులుగా కలిసి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.