ముద్ర ప్రతినిధి, భువనగిరి : విద్యార్థులు కష్టపడి కాకుండ ఇష్టపడి చదివినపుడే లక్ష్యాలు సాధ్యమని జీనియస్
పాఠశాల కరెస్పాండంట్ డాక్టర్ బి. సూర్యనారాయణరెడ్డి అన్నారు. ఆదివారం జీనియస్ పాఠశాల పదవ తరగతి విద్యార్థుకు జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా పట్టుదలతో చదివి పదవ తరగతి పరీక్షలలో తమ ప్రతిభను కనబరిచాలన్నారు. పాఠశాల ఛైర్మన్ పడాల శ్రీనివాస్ మాట్లాడుతూ ఇన్ని సంవత్సరాలుగా పాఠశాల స్థాయిలో క్రమశిక్షణతో విద్యనభ్యసించిన పరీక్షలలో మంచి ఫలితాలు సాధించాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు.