Take a fresh look at your lifestyle.

పెట్రోల్, గ్యాస్ నిల్వలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణి, ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతోనే ప్రజలకు ఇబ్బందులు బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్

 

ముద్ర, కుత్బుల్లాపూర్ :
“నో స్టాక్” బోర్డులతో పెట్రోల్ బంకులు, గ్యాస్ ఏజెన్సీల వద్ద ప్రజలు పడుతున్న ఇబ్బందులపై బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి వాటి సరఫరాలో రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేసి నిల్వ చేసుకున్నట్లయితే ప్రజలు ఇబ్బందులు పడేవారు కాదు అన్నారు.నేటి ఈ పెట్రోల్, గ్యాస్ సరఫరా కొరత సంఘటన యూరియా కొరత సంఘటనను గుర్తుకు తెస్తా ఉంది. దీనికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి, అశ్రద్ధ మాత్రమే అని అన్నారు.
ప్రస్తుతం విపత్తుతో యుద్ధం ఉన్న దేశాల కంటే యుద్ధం లేని మన దేశంలోనే ప్రజలు అవస్థలు పడతా ఉన్నారు.
యుద్ధం జరుగుతా ఉంది, భవిష్యత్తులో ప్రజలకు ఇబ్బందులు గురవుతారనే ముందస్తు ఆలోచన ఉంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక నిల్వలు సేకరించుకోవాల్సి ఉండే.పరిపాలన గాలికి వదిలేయడం వల్లనే ఈ సమస్య తయారయిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నెపం నెట్టుకోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారని ప్రస్తుత పరిస్థితికి తోడు ప్రధాని కరోనా వంటి పరిస్థితులకు ప్రజలు సిద్ధంగా ఉండండి అనడంతో ప్రజలు మరింత అయోమయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భేషజాలకు పోకుండా సమన్వయపరచుకొని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలి.

Leave A Reply

Your email address will not be published.