Take a fresh look at your lifestyle.

ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి ఎస్‌టియు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు హనుమంత రెడ్డి డిమాండ్

 

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:

ఉపాధ్యాయులకు ప్రభుత్వం చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఎస్‌టియు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు వడ్డే హనుమంత రెడ్డి డిమాండ్ చేశారు.
అచ్చంపేట మండలంలోని నడింపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అర్జునయ్య పదవీ విరమణ సందర్భంగా నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్‌టియు) జిల్లా అధ్యక్షుడు ఎస్. మురళి, కార్యదర్శి కొత్త శ్రీధర్ రావుతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హనుమంత రెడ్డి మాట్లాడుతూ, ఉపాధ్యాయులకు సంబంధించిన జిపిఎఫ్, ఆరోగ్య బీమా, మెడికల్ బిల్లులను సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉంచడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం వెంటనే ఆ బిల్లులను చెల్లించి ఉపాధ్యాయులను ఆదుకోవాలని కోరారు.
అలాగే రెండో పి.ఆర్.సి ప్రకటించి అమలు చేయాలని, పర్యవేక్షక పోస్టులైన ఎంఈఓ, డిప్యూటీ డీఈవో, డైట్ లెక్చరర్ ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సన్మాన కార్యక్రమంలో:
అచ్చంపేట మండల అధ్యక్షుడు నారాయణ గౌడ్, కార్యదర్శి భాస్కర్, వివిధ మండలాల నాయకులు చంద్రశేఖర్, విష్ణు, నరేందర్ రెడ్డి, ప్రవీణ్, శ్రీకాంత్, రాజు, కృష్ణయ్య, శ్రీనివాస్, ఈశ్వర్, బ్రహ్మేంద్ర యాదవ్, సృజన, కవిత, మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు పోకల సతీష్, రవి శేఖర్, కొంగరీ రమేష్ ప్రభాకర్, ఏం. సుదర్శన్, విద్యాసాగర్ సత్యనారాయణ, కాశన్న తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.