ముద్ర ప్రతినిధి , కోదాడ …
గ్రే కాప్స్ సంస్థ మరియు టీచర్స్ ట్రైబ్ సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా ఉపాధ్యాయులకు 6వ వరల్డ్ టీచర్స్ క్విజ్ 2026 పోటీలను బెంగళూరు వేదికగా నిర్వహించింది. ఈ పోటీలు మార్చి నెల 1 వ తేదీ నుండి 28 వరకు ఆన్లైన్ వేదికగా వివిధ దశలలో నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన ఈ వరల్డ్ టీచర్స్ క్విజ్ 2026 పోటీలో 11 వేల మంది పైగా ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నాలుగు విడతల్లో పోటీలు నిర్వహించారు. అత్యుత్తమ ప్రతిభ చూపిన నలుగురు ఉపాధ్యాయులు ఫైనల్ పోటీలకు ఎంపికయ్యారు. వీరిలో కోదాడ తేజ విద్యాలయ కి చెందిన ఉస్తాల ధనుష్ రెడ్డి ఎంపికయ్యారు . ఫైనల్ పోటీలను ఐదు రౌండ్లు గా క్విజ్ మాస్టర్ రేష్మీ పుటాడో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం , సూర్యాపేట జిల్లాకు చెందిన కోదాడ – తేజ విద్యాలయ , సోషల్ ఉపాధ్యాయుడు ఉస్తాల ధనుష్ రెడ్డి (500 ) మార్కులు సాధించి ప్రథమస్థానంలో నిలిచి ఇరవై వేల రూపాయల బహుమతిని గెలుచుకోవడం జరిగింది. ఉపాధ్యాయులను ప్రోత్సహించడమే ఉద్దేశంగా ఈ క్విజ్ కార్యక్రమం ను యూ ట్యూబ్ లో పెట్టడం జరిగింది.
తేజ విద్యాలయ కు చెంది ధనుష్ రెడ్డికి చిన్నప్పటి నుంచి క్విజ్ లంటే చాలా ఇష్టమని, జాతీయ స్థాయిలో ఎన్నో క్విజ్ పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచాడని విద్యారంగం మీద మక్కువతో ఉపాధ్యాయు వృత్తిని ఎంచుకోవడం గర్వంగా ఉందని తేజ విద్యాలయ ప్రిన్సిపల్ మరియు ధనుష్ రెడ్డి తల్లి గారైన రమాసోమిరెడ్డి చెప్పడం జరిగింది. తండ్రి సోమిరెడ్డి ఎక్సైజ్ శాఖలో నిజామాబాద్ డిప్యూటీ కమీషనర్ గా పనిచేస్తున్నారు.
ముద్ర ప్రతినిధి , కోదాడ ….. గ్రే కాప్స్ సంస్థ మరియు టీచర్స్ ట్రైబ్ సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా ఉపాధ్యాయులకు 6వ వరల్డ్ టీచర్స్ క్విజ్ 2026 పోటీలను బెంగళూరు వేదికగా నిర్వహించింది. ఈ పోటీలు మార్చి నెల 1 వ తేదీ నుండి 28 వరకు ఆన్లైన్ వేదికగా వివిధ దశలలో నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన ఈ వరల్డ్ టీచర్స్ క్విజ్ 2026 పోటీలో 11 వేల మంది పైగా ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నాలుగు విడతల్లో పోటీలు నిర్వహించారు. అత్యుత్తమ ప్రతిభ చూపిన నలుగురు ఉపాధ్యాయులు ఫైనల్ పోటీలకు ఎంపికయ్యారు. వీరిలో కోదాడ తేజ విద్యాలయ కి చెందిన ఉస్తాల ధనుష్ రెడ్డి ఎంపికయ్యారు . ఫైనల్ పోటీలను ఐదు రౌండ్లు గా క్విజ్ మాస్టర్ రేష్మీ పుటాడో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం , సూర్యాపేట జిల్లాకు చెందిన కోదాడ – తేజ విద్యాలయ , సోషల్ ఉపాధ్యాయుడు ఉస్తాల ధనుష్ రెడ్డి (500 ) మార్కులు సాధించి ప్రథమస్థానంలో నిలిచి ఇరవై వేల రూపాయల బహుమతిని గెలుచుకోవడం జరిగింది. ఉపాధ్యాయులను ప్రోత్సహించడమే ఉద్దేశంగా ఈ క్విజ్ కార్యక్రమం ను యూ ట్యూబ్ లో పెట్టడం జరిగింది.
తేజ విద్యాలయ కు చెంది ధనుష్ రెడ్డికి చిన్నప్పటి నుంచి క్విజ్ లంటే చాలా ఇష్టమని, జాతీయ స్థాయిలో ఎన్నో క్విజ్ పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచాడని విద్యారంగం మీద మక్కువతో ఉపాధ్యాయు వృత్తిని ఎంచుకోవడం గర్వంగా ఉందని తేజ విద్యాలయ ప్రిన్సిపల్ మరియు ధనుష్ రెడ్డి తల్లి గారైన రమాసోమిరెడ్డి చెప్పడం జరిగింది. తండ్రి సోమిరెడ్డి ఎక్సైజ్ శాఖలో నిజామాబాద్ డిప్యూటీ కమీషనర్ గా పనిచేస్తున్నారు.