Take a fresh look at your lifestyle.

పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకే పదవులు-ఎమ్మెల్యే మందుల సామేలు, టీపీసీసీ ఉపాధ్యక్షుడు, అబ్జర్వర్ కొండేటి మల్లయ్య

 

త్వరలో నామినేటెడ్ పదవులు కూడా దక్కుతాయి

రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలి

ముద్ర ,తుంగతుర్తి…..

పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసే కార్యకర్తలకు, నాయకులకు తగిన గుర్తింపు ఉంటుందని, వారికే పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులు దక్కుతాయని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, అబ్జర్వర్ కొండేటి మల్లయ్య, ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య అధ్యక్షతన జరిగిన నియోజకవర్గంలోని వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షుల ఎన్నిక సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కొండేటి మల్లయ్య మాట్లాడుతూ…. కాంగ్రెస్ పార్టీలో మూడు సంవత్సరాలు పాటు పని చేసిన వారికి పార్టీ పదవులు ఇవ్వడం జరుగుతుందని అధిష్టానం నిర్ణయించిందన్నారు. దీనిని కూడా సవరించి టీపీసీసీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలను ప్రభుత్వం గుర్తింపు ఇస్తుందన్నా రు. ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందలేదన్నారు. అనంతరం ఎమ్మెల్యే మందుల సామేలు మాట్లాడుతూ…. తుంగతుర్తి నియోజకవర్గ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తానని, నియోజకవర్గ ఏర్పడినప్పటి నుంచి కూడా అభివృద్ధికి నోచుకోలేవడం లేదని , రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో అత్యంత వెనకబడిన నియోజకవర్గ తుంగతుర్తి అన్నారు. ఈ తుంగతుర్తి ప్రాంతంలో ఏదో ఒకటి చేయాలనే దృఢసంకల్పంతో ఉన్నానని, తాను ఖచ్చితంగా చేసి తీరుతానన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిరంతరం పేద ప్రజల సంక్షేమ కోసం పని చేస్తున్నారని, ఏర్పడిన రెండేళ్లలోనే నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఉచిత విద్యుత్, మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం, హాస్టల్లో మెస్ ఛార్జీలను పెంచడం జరిగిందన్నారు. ఎందరో అమరవీరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ కేసీఆర్ కుటుంబ పాలనతో అన్ని వర్గాల ప్రజలు విసుగు చెందారన్నారు. ఇప్పుడు అదే కుటుంబంలో ఆస్తుల పంపకాల పంచాయతీ జరుగుతుందన్నారు. ఒక్కొక్క నాయకుడు ఇప్పుడే పార్టీకి దూరమవుతున్నట్లు సోషల్ మీడియాలో రోజు చూస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా రంజక పాలన సాగుతుందన్నారు. ప్రతి కార్యకర్తకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, ఏ కష్టం వచ్చిన తనకు తెలియజేస్తే పరిష్కారం చేస్తానన్నారు. పార్టీ పటిష్టత కోసం పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. పార్టీ కోసం పనిచేసే వారిని గుర్తించి వారికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా పార్టీ బలోపేతం అవుతుందన్నారు. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు చెవిటి వెంకన్న యాదవ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు తిరుమలప్రగడ అనురాధ కిషన్ రావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సూర్యాపేట జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు దరూరి యోగానంద చార్యులు, మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి, వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, వివిధ మండలాల అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, మహిళా కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.