ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్య ! -బీజేపీ మోత్కూర్ మండల అధ్యక్షులు గుదే మధుసూదన్ యాదవ్.
ముద్ర ,మోత్కూర్:
తెలంగాణలో కార్మికుల ప్రాణాలు ఇలా చవకబారిపోయాయా ఇందుకోసమేనా పోరాడి తెలంగాణ సాధించుకుంది.ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఒక అమాయక నిండు ప్రాణం బలైంది అని నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్యానని బిజెపి మండల అధ్యక్షులు గూదే మధుసూదన్ అన్నారు. శుక్రవారం ఆయన మోత్కూర్ లో విలేకరులతో మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై డ్రైవర్ శంకర్ గౌడ్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడనీ
80% కాలిన గాయాలతో ఎంజీఎంలో చికిత్స పొందుతూ, తరువాత హైదరాబాద్ నిమ్స్‌కు తరలించగా, చివరకు ప్రాణాలు కోల్పోయాడు తక్షణమే శంకర్ గౌడ్ కుటుంబానికి 50 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించి, వెంటనే ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని బిజెపి మోత్కూర్ మండల భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేశారు.కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు గుంటి సతీష్ ,నార్సింగ్ మహేష్, బండ నరసింహ, బండ నర్సిరెడ్డి, నాయిని ఉపేందర్, ఇట్టబోయిన ఆంజనేయులు, నల్ల పోగుల వెంకన్న, బత్తిని సతీష్ తదితరులు పాల్గొన్నారు.