Take a fresh look at your lifestyle.

సింగరేణి లో బిఆర్ఎస్ కంటే కాంగ్రెస్ ప్రభుత్వం లో రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగింది

  • జూలై 9న సమ్మె విజయవంతం చేసిన కార్మికులకు కృతజ్ఞతలు.
  • జిడికె 2వ ఇంక్లైన్ లో జరిగిన గేట్ మీటింగ్ లో గుర్తింపు సంఘం ఏఐటియుసి అద్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య.

ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: సింగరేణి లో కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూలై 9 న దేశ వ్యాప్త సమ్మె ను విజయవంతం చేసిన కార్మిక వర్గానికి కృతజ్ఞతలు తెలుపుతు న్నామని సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటియుసి అద్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు గురువారం సింగరేణి ఆర్జీ వన్ ఏరియా లోని జిడికె 2.వ ఇంక్లైన్ లో ఏఐటియుసి ఆర్జీ వన్ బ్రాంచి ఆద్వర్యంలో జరిగిన గేట్ మీటింగ్ లో ఆయన పాల్గొని మాట్లాడుతూ సింగరేణి లో గత బిఆర్ఎస్ ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వం లో రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగిపోయిందని అన్నారు.ప్రజా ప్రతినిధులకు కొంతమంది జనరల్ మేనేజర్ లు చపరాసులుగా వ్యవహారిస్తూ కార్మికుల సమస్యల ను పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. సింగరేణి కి 36 వేల కోట్ల రూపాయల బకాయి లు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కి చెల్లించక పోవడం వల్ల కొత్త గనులురావడం లేదని,సంస్థ లో యంత్రాలు,పని ముట్లు పాతబడి,చెడిపోయి, కొత్తవి కొనలేని పరిస్థితినెలకొందని ఆయన పేర్కొన్నారు.గుర్తింపు సంఘంగా ఏఐటియుసి గెలిచిన తరువాత కార్మికుల సమస్యలపై, సంక్షేమంపై సి అండ్ ఎండి, డైరెక్టర్ ఫా స్థాయి సమావేశాల్లో అంగీకరించిన కార్మికుల సమస్యలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా మారుపేర్లు,స్వంత ఇంటి పథకం, పెర్క్సు పై ఆదాయపు పన్ను ను సింగరేణి అధికారులకు అమలు చేసిన విధంగా కార్మికులకు అమలు కోసం,డిస్మిస్ కార్మికులను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు కమీటీల పేరు తో కాలయాపన చేయకుండా వెంటనే అమలు కు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.సింగరేణి లో సీనియారిటీ ప్రకారం కార్మికులకు కౌన్సెలింగ్ ద్వారా క్వార్టర్స్ అలాట్ మెంట్ చేయాలని,అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికులకు డిప్యూటేషన్లు ఇవ్వాలని,ఫైరవీ కారి విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు.సింగరేణి సంస్థ ను కాపాడుకునేందుకు ఏఐటియుసి పోరాటాలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఏఐటియుసి ఆర్జీ వన్ బ్రాంచి సహాయ కార్యదర్శి రంగు శ్రీను అద్యక్షతన జరిగిన ఈ సమావేశం లో ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్, కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి,ఆర్జీ వన్ బ్రాంచి కార్యదర్శి ఆరెల్లి పోషం,బ్రాంచిఉపాధ్యక్షులు
మాదన మహేష్,నాయకులు ఎస్ వెంకట్ రెడ్డి,మిట్ట శంకర్,సయ్యద్ సోహేల్,పొన్నాల వెంకటయ్య, కారంపూరి వెంకన్న, గుర్రం ప్రభు దాస్, పెద్దెల్లి శంకర్, భక్తి శ్రీనివాస్, ఎల్.రమేశ్, వెంకటేశ్వర్లు, ఏ.వి. ఎస్ ప్రకాష్,బుడిమె సమ్మయ్య, పడాల కనకరాజు, పర్లపెల్లి రామ స్వామి, గంగారపు చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.